సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ‘ఫ్లాబో నెరుడా’ అనే తొలి గీతాన్ని విడుదల చేశారు. అచ్చు రాజమణి స్వరపరచిన ఈ గీతాన్ని వనమాలి రచించారు. బెన్నీ దయాల్ ఆలపించారు. హీరో పరిచయ గీతమిదని, విజువల్స్ కట్టిపడేస్తాయని చిత్ర బృందం పేర్కొంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, సిద్ధు జొన్నలగడ్డ పాత్ర నవ్యరీతిలో సాగుతుందని మేకర్స్ తెలిపారు. వైష్ణవిచైతన్య, ప్రకాష్‌రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితరులు ఈ చిత్రంలో నటించారు.