Gaddar Awards | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక గద్దర్ సినీ పురస్కారాల్లో రెండో ఉత్తమ చిత్రంగా పాఠశాల నిలిచింది. 2014 ఏడాదికి గానూ సెకండ్ బెస్ట్ ఫిలింగా ఈ చిత్రాన్ని ఎంపికైంది. రాకేశ్ మాహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేశ్ మహంకాళి, పవన్ కుమార్ రెడ్డి నిర్మించారు.
ఐదు వారాల పాటు ఐదుగురు మిత్రులు ఐదు వేల కిలోమీటర్లు చేసిన ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాఠశాల చిత్రం తెరకెక్కింది. యువత, స్నేహం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను అందంగా చూపించే ఒక అద్భుతమైన కథగా ఈ సినిమా 2014లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మనసుల్ని తాకిన గొప్ప కథనం, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన విజువల్స్ మేళవింపుతో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది.
2014 సంవత్సరానికి గానూ ప్రతిష్ఠాత్మక గద్దర్ సినీ అవార్డు అందుకోవడం పట్ల పాఠశాల చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తంచేశారు. తమ గద్దర్ చిత్రం రెండో ఉత్తమ ఫీచర్ చిత్రంగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ గుర్తింపు తమ చిత్రానికి ఉన్న శాశ్వతమైన ప్రభావాన్ని, విలువలను మరింత బలపరుస్తోందని అన్నారు.