Paatal Lok Season 2 | కరోనా లాక్డౌన్ టైంలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న వెబ్ సిరీస్‌లలో పాతాల్ లోక్ (Paatal Lok Web Series) ఒకటి. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ను స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య నటి అనుష్కా శర్మ నిర్మించగా.. జైదీప్ అహ్లావత్, అభిషేక్ బెనర్జీ, స్వస్తిక ముఖర్జీ, గుల్ పనాగ్ తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రలో నటించారు. హాథీ రామ్ చౌదరిగా పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో జైదీప్ అహ్లావత్ మంచి మార్కులు సంపాదించాడు.
అయితే ఈ వెబ్ సిరీస్‌కి సీక్వెల్ తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాతల్ లోక్ సీజన్ 2 అంటూ రాబోతున్న ఈ సిరీస్‌లో కూడా లీడ్ రోల్స్‌లో జైదీప్ అహ్లావత్‌తో పాటు, ఇష్వాక్ సింగ్, తిలోతమా షోమ్, గుల్ పనాగ్ నటిస్తున్నారు. ఇప్పటికే సీజన్‌కి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా.. ఫుల్ రెస్పాన్స్ అందుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. గత సీజన్లో మావోయిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీతో వచ్చిన పాతాల్ లోక్.. ఈ సీజన్లో నాగాలాండ్ రెబల్స్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Paatal Lok mein aapka swagat hai#PaatalLokOnPrime, New Season, Watch Nowhttps://t.co/iJ9ZTghfxH pic.twitter.com/MU2ROkK2wy
— prime video IN (@PrimeVideoIN) January 16, 2025