Paatal Lok Season 2 | కరోనా లాక్డౌన్ టైంలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న వెబ్ సిరీస్‌లలో పాతాల్ లోక్(Paatal Lok Web Series) ఒకటి. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ను స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య నటి అనుష్కా శర్మ నిర్మించగా.. జైదీప్ అహ్లావత్, అభిషేక్ బెనర్జీ, స్వస్తిక ముఖర్జీ, గుల్ పనాగ్ తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రలో నటించారు.
2020 మే 15న ఆమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ మొదటి రోజు నుంచే రికార్డు వ్యూస్ సాధించింది. హాథీ రామ్ చౌదరిగా పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో జైదీప్ అహ్లావత్ మంచి మార్కులు సంపాదించాడు. అయితే ఈ వెబ్ సిరీస్‌కి సీక్వెల్ తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాతల్ లోక్ సీజన్ 2 అంటూ రాబోతున్న ఈ సిరీస్‌లో కూడా లీడ్ రోల్స్‌లో జైదీప్ అహ్లావత్‌తో పాటు, ఇష్వాక్ సింగ్, తిలోతమా షోమ్, గుల్ పనాగ్ నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ జనవరి 17 నుంచి ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది. గత సీజన్లో మావోయిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీతో వచ్చిన పాతాల్ లోక్ మేకర్స్.. ఈ సీజన్లో నాగాలాండ్ రెబల్స్ కాన్సెప్ట్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది.