Pa Ranjith | కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దర్శకుడిగా కూడా మంచి చిత్రాలు చేశాడు. ఇక ఆయన నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నారు. అయితే పా రంజిత్ సహ నిర్మాతగా వ్యవహరించిన పాపా బుకా అనే చిత్రం 98వ ఆస్కార్ అవార్డుల పోటీకి ఎంట్రీ సాధించడం విశేషం. పపువా న్యూ గినీ( పీఎన్జీ) దేశం నుండి అర్హత సాధించిన తొలి చిత్రంగా ఈ మూవీ రికార్డ్ సాధించింది. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ చిత్రం పోటీ పడనున్న నేపథ్యంలో పా రంజిత్ సంతోషం వ్యక్తం చేశారు. తమ నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్ గర్వించదగ్గ క్షణమని ఆయన స్పష్టం చేశారు.అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకి పాప బుకా అధికారంగా ఎంపికైంది. పపువా న్యూ గినియా దేశం ఎంట్రీగా ఈ చిత్రం ఎంపికైందని చెప్పడానికి గర్వంగా ఉందని అన్నారు.
పాపా బుకా కథని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వారితో కలిసి పని చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.భారతదేశం నుండి నిర్మాతలలో ఒకరిగా, రెండు దేశాల సహ నిర్మాణంలో భాగం కావడం నీల్ ప్రొడక్షన్స్‌కి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఈ కథని ప్రపంచ వేదిక వరకు తీసుకెళ్లడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి దక్కిన గౌరవం ఇది. ఈ సినిమా ద్వారా ప్రశంసలు దక్కించుకోవడం రెండు దేశాలకి గౌరవం అని అన్నారు. ఈ ఘనత సాధించిన పాపా బుకా చిత్ర బృందానికి శుభాకాంక్షలు అని రంజిత్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇది ఒక చరిత్రాత్మక క్షణం కాగా, పాపా బుకా కథలు మన సంప్రదాయాలని ప్రతిబింబిస్తుంటాయి.అకాడమీ అవార్డుల ద్వారా ఈ చిత్రాన్ని ప్రపంచానికి అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని పపువా న్యూ గినీ ఆస్కార్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ డాన్ వెల్స్ పేర్కొన్నారు. ఈ చిత్ర కథ ఏంటంటే.. రెండో ప్రపంచ యుద్ధంలో పీఎన్‌జీలో పోరాడిన భారతీయ సైనికుల గురించి చాటి చెప్పారు. ఈ చిత్రానికి మూడు నేషనల్ అవార్డ్స్ అందుకున్న మలయాళ దర్శకుడు బిజు కుమార్ దమోదరన్ దర్శకత్వం వహించారు. వారి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తి కాబోతున్న క్రమంలో నోయెలిన్ భారతీయులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.