సామాజిక సమస్యలను కథావస్తువులుగా తీసుకొని వాటిని కమర్షియల్ పంథాలో ఆవిష్కరిస్తూ ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ డైరెక్టర్ పా.రంజిత్. ఆయన తాజా చిత్రం ‘తంగలాన్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. విక్రమ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని హిందీలో కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు.
ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న పా.రంజిత్ తన బాలీవుడ్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. హిందీలో స్ట్రెయిట్ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశానని, దానికి ‘బిర్సా ముండా’ అనే టైటిల్‌ను పెట్టానని పా.రంజిత్ తెలిపారు.
అగ్ర హీరో ఇందులో నటిస్తాడని ఆయన పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం రణ్‌వీర్‌సింగ్‌తో పా.రంజిత్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారని తెలిసింది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.