Pa Ranjith – Drinking Tea | తమిళ దర్శకుడు పా.రంజిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కబాలి, కాలా, సర్పాట్టా పరంబరై వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు తంగలాన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు మూవీతో పాటు దర్శకుడిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకువస్తున్న ఎస్సీ వర్గీకరణపై పా.రంజిత్ విమర్శలు చేయడంతో అతడిని అతడి సినిమాలను బ్యాన్ చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలావుంటే తాజాగా పా.రంజిత్ అంటరానితనం మీద ఎప్పుడో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరియేరుమ్ పెరుమాళ్ సినిమా టైంలో పా.రంజిత్ మాట్లాడుతూ.. అంటరానితనం అనేది అప్డేట్ అవుతుంది. మనకు తెలియట్లే అంతే. ఇంతకుముందు చాయ్ పెద్ద కులస్తులకు గ్లాసుల్లో ఇచ్చేవారు. తక్కువ కులం వారికి ప్లాస్టిక్ గ్లాస్లో ఇచ్చేవాళ్లు అనంతరం వారికి పేపర్ కప్పుల్లో ఇస్తున్నారు. ఎవరైనా ఇది అడిగితే మీది తక్కువ కులం అనేవారు.
చాలా మంది ఇళ్లల్లో ఎవరైన బంధువులు వస్తే స్టీల్ లేదా గాజు గ్లాస్లో చాయ్ ఇస్తాం. అదే ఎవరైన పని వాళ్లు వచ్చిన తక్కువ కులం వాళ్లు వచ్చిన పేపర్ కప్పుల్లో పోసి ఇస్తాం. ఎందుకంటే కడగాలి కాబట్టి. అయితే చాలా మందికి ఈ విషయం తెలియదు అంటూ చెప్పుకోచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలపై రంజిత్‌ను కొందరు ట్రోల్ చేస్తుండగా.. మరికొందరు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు.
modern untouchability paper cups pic.twitter.com/CKEI9ayxMG
— katt 🌼 (@kattberrie) August 14, 2024
. https://t.co/VDDxzpgJKJ pic.twitter.com/5mmYGzO0yP
— lovedalecowball (@saambumavane) August 14, 2024