అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటించిన హిందీ చిత్రం ‘మిషన్ మజ్ను’ ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారానే ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ చిత్రాన్ని 1970 దశకం నాటి ప్రేమకథతో తెరకెక్కించారు. దేశభక్తి, ప్రేమ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా భారత గూఢచారి ఏజెంట్ పాత్ర లో కనిపించనున్నాడు. తొలుత ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.
అనేక వాయిదాల అనంతరం తాజా గా ఓటీటీ రిలీజ్‌కు మొగ్గుచూపారు. జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దక్షిణాదిన వరుస విజయాలతో దూ సుకెళ్తున్న రష్మికకు హిందీ చిత్రసీమలో మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదు. అమితాబ్‌బచ్చన్ కూతురిగా రష్మిక మందన్న నటించిన ‘గుడ్‌బై’ చిత్రం నిరాశను మిగిల్చింది. తాజాగా ‘మిషన్ మజ్ను’ థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కావడం బాలీవుడ్లో రష్మిక మందన్న కెరీర్‌కు మైనస్‌గా మారనుందని అంటున్నారు.