OTT Streaming Movies This Week | టాలీవుడ్లో ఒకవైపు థియేటర్లలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్‌తో పాటు ‘ఛావా’ తెలుగు వెర్షన్, తమిళం నుంచి ‘కింగ్స్టన్’ చిత్రాలు వచ్చి సందడి చేస్తుంటే.. ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా అక్షయ్ కుమార్ ‘స్కై ఫోర్స్’తో పాటు శర్వానంద్ ‘మనమే’, సోన్ సూద్ ‘ఫతేహ్’ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఇక ఏ చిత్రం ఫ్లాట్‌ఫామ్‌లో ఉందో చూసుకుంటే..
మనమే
Manamey
టాలీవుడ్ నటుడు శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘మనమే’(). ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. గతేడాది జూన్ 07న ప్రేక్సకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్ అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలై 10 నెలలు అయిన ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
‘స్కైఫోర్స్’
Sky Force
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం స్కై ఫోర్స్’(Sky Force). ఈ సినిమాతో వీర్ పహరియా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ ఈ సినిమాకు సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్ కీలక పాత్రలు పోషించారు. జియో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్ బ్యానర్లపై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మించాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది.
ఫతేహ్
Fateh
నటుడు సోనూసూద్ ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఫతేహ్’ (Fateh). జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికగా నటించగా యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం వచ్చింది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తాజాగా జియో హాట్‌స్టార్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది.
గేమ్ ఛేంజర్
Game Changer
రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా హిందీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.