OTT | ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా ఇటు థియేటర్స్, అటు ఓటీటీలలో వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. థియేటర్స్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ చిత్రంతో పాటు విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ల సార్ మేడమ్ కూడా సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు ఉసురే వంటి డబ్బింగ్ సినిమా, అలాగే సన్ ఆఫ్ సర్దార్ 2 అనే హిందీ మూవీ కూడా థియేటర్స్‌లోకి వచ్చి సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. మరోవైపు ఓటీటీలో సుమారు 20కిపైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
అయితే వీటితో నితిన్ హీరోగా తెరకెక్కిన తమ్ముడు మూవీపై అందరిలో ఆసక్తి ఉంది. తమ్ముడు చిత్రంథియేటర్లలో పెద్దగా ఆకట్టుకోకపోవడంతో త్వరగానే ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి ఇది ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. అలాగే బకైటి అనే హిందీ వెబ్ సిరీస్ తో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా అలరించేందుకు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ లో చూస్తే.. ఇరాన్ చెఫ్ థాయ్ లాంట్ వర్సెస్ ఆసియా (రియాలిటీ సిరీస్) – జూలై 28, ట్రైన్ రెక్: స్ట్రోమ్ ఏరియా 51 (ఇంగ్లిష్ మూవీ) – జూలై 29, WWE: అన్ రియల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 29, కన్వర్జేషన్స్ విత్ కిల్లర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 30, అన్ స్పీకబుల్ సిన్స్ (స్పానిష్ వెబ్ సిరీస్) – జూలై 30, యాన్ హానెస్ట్ లైఫ్ (స్పీడిష్ సినిమా) – జూలై 31, గ్లాస్ హార్ట్ (జపనీస్ వెబ్ సిరీస్) – జూలై 31, లియాన్నే (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 31,మార్క్డ్ (జులు వెబ్ సిరీస్) – జూలై 31, తమ్ముడు (తెలుగు సినిమా) – ఆగస్టు 01న స్ట్రీమ్ కానుంది.
ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూస్తే.. లోన్లీ ఇనఫ్ టూ లవ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూలై 28, చెక్ (తెలుగు సినిమా) – జూలై 28న స్ట్రీమింగ్ కానుంది. జియో హాట్‌స్టార్ లో అడ్డా ఎక్స్ట్రీమ్ బాటిల్ (రియాలిటీ సిరీస్) – జూలై 28, క్యుంకీ సార్ బీ కబీ బహు థీ సీజన్ 2 (హిందీ సిరీస్) – జూలై 29,బ్లాక్ బ్యాగ్ (ఇంగ్లిష్ సినిమా) – జూలై 28, పతీ పత్నీ ఔర్ పంగా (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్టు 02న స్ట్రీమ్ కానుంది. జీ5 ఓటీటీలోలో బకైటి (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్టు 01న స్ట్రీమ్ కానుండగా, ఆపిల్ ప్లస్ టీవీలో చీఫ్ ఆఫ్ వార్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 01, స్టిల్ వాటర్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 01న స్ట్రీమ్ కానుంది. సన్ నెక్స్ట్ లో.. సురభిల సుందర స్వప్నం (మలయాళ సినిమా) – ఆగస్ట్ 1 నుండి స్ట్రీమ్ కానుంది.