OTT | ఈ వారం సినీ ప్రేమికులకు ఎంటర్టైన్మెంట్ పండుగే. పెద్ద హీరోల సినిమాల నుంచి కంటెంట్ బేస్డ్ మూవీస్ అన్నీ ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. నవంబర్ రెండో వారంలో రాబోతున్న ఈ చిత్రాలు ఒక్కొక్కటి ఒక్కో జానర్లో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాయి. మరి ఈ వారం రిలీజవుతున్న థియేటర్, ఓటీటీ మూవీస్ లిస్ట్ చూస్తే..
థియేటర్ సినిమాలు
కాంత (Kaantha)
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన పీరియడ్ డ్రామా ‘కాంత’ నవంబర్ 14న థియేటర్లలోకి వస్తోంది. 1950ల మద్రాస్ నేపథ్యంలో సాగిన ఈ కథలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషించారు. రానా, దుల్కర్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి ట్రైలర్‌తోనే భారీ రెస్పాన్స్ లభించింది. విజువల్ ప్రెజెంటేషన్, మ్యూజిక్, రానా–దుల్కర్ కాంబినేషన్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
శివ (4K రీ-రిలీజ్)
తెలుగు సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ మరోసారి పెద్ద తెరపైకి రానుంది. నాగార్జున–రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ఈ లెజెండరీ మూవీ, అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల సందర్భంగా నవంబర్ 14న 4K డాల్బీ అట్మాస్ వెర్షన్లో రీ-రిలీజ్ అవుతోంది. 1989లో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ సృష్టించగా, ఇప్పుడు కొత్త తరం ప్రేక్షకులకు మళ్లీ ఆ అనుభూతి కలిగించబోతోంది.
సంతాన ప్రాప్తిరస్తు
చాందిని చౌదరీ–విక్రాంత్ జంటగా నటించిన ఈ ఎమోషనల్ డ్రామా కూడా నవంబర్ 14న విడుదల అవుతోంది. సంతాన లేమి సమస్యను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్, అభినవ్ గోమటం కీలక పాత్రల్లో నటించారు. సస్పెన్స్‌తో మిళితమైన ఫ్యామిలీ డ్రామాగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.
జిగ్రీస్
కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కృష్ణ వోడపల్లి నిర్మించారు. సందీప్ రెడ్డి వంగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది… ‘ఈ నగరానికి ఏమైంది’, ‘జాతిరత్నాలు’ తరహాలో ఫన్ రైడ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ నెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఓటీటీ రిలీజ్లు
అమెజాన్ ప్రైమ్ వీడియో
ప్లే డేట్ – నవంబర్ 12
జియో హాట్‌స్టార్
జాలీ ఎల్ఎల్బీ – నవంబర్ 14
నెట్‌ఫ్లిక్స్
మెరైన్స్ – నవంబర్ 10
దిల్లీ క్రైమ్ 3 – నవంబర్ 13
డ్యూడ్ – నవంబర్ 14 (ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో)
తెలుసు కదా – నవంబర్ 14
బైసన్ – నవంబర్ 14
జీ5
ఇన్స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్ – నవంబర్ 14)
మనోరమా మ్యాక్స్
కప్లింగ్ – నవంబర్ 14
ఆహా – కె ర్యాంప్ (నవంబర్ 14)
ఈ వారం థియేటర్స్‌లో పీరియడ్ డ్రామా, రీ-రిలీజ్ కల్ట్ మూవీలు ఆకట్టుకోనుండగా, ఓటీటీల్లో థ్రిల్లర్లు, కామెడీ డ్రామాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు ఫుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఖాయం.