OTT Movies | సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఈ వారం ప్రముఖ ఓటీటీ వేదికల్లో రాబోతున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన చిత్రాలు ఇప్పుడు ఓటీటీ వేదికపై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్దమవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్ వంటి వేదికల్లో వరుసగా కొత్త కంటెంట్ రిలీజ్ అవుతోంది. మరోవైపు థియేటర్స్‌లో కూడా కొన్ని సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. బాహుబలి ది ఎపిక్ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుండగా, రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమా అక్టోబర్ 31న విడుదల కావాల్సి ఉంది. బాహుబలి: ది ఎపిక్ వలన నవంబర్ 1న ఈ చిత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.. అయితే అక్టోబర్ 31న ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారని సమాచారం.
శత్రు, బ్రహ్మాజీ, మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘కర్మణ్యే వాధికారస్తే’ (Karmanye Vadhikaraste) కూడా అక్టోబర్ 31న విడుదల కానుంది. పరేశ్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది తాజ్ స్టోరీ'(The Taj Story)కూడా అక్టోబర్ 31న థియేటర్లలోకి రాబోతోంది. తుషార్ అమ్రిష్ గోయెల్ దర్శకత్వంలో సురేశ్ ఝూ నిర్మించిన ఈ చిత్రానికి ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కొంత వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.
ఓటీటీ రిలీజ్లు చూస్తే..
నెట్‌ఫ్లిక్స్‌లో
ది అస్సెట్ (మూవీ) – అక్టోబర్ 27
అలీన్ (మూవీ) – అక్టోబర్ 30
ఇడ్లీ కొట్టు (మూవీ) – అక్టోబర్ 29
బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (మూవీ) – అక్టోబర్ 29
అమెజాన్ ప్రైమ్
హెడ్డా (మూవీ) – అక్టోబర్ 29
హెజ్బిన్ హోటల్ (వెబ్ సిరీస్) – అక్టోబర్ 29
జియో హాట్‌స్టార్
మానా కీ హమ్ యార్ నహీన్ (వెబ్ సిరీస్) – అక్టోబర్ 29
లోక చాప్టర్: 1 – అక్టోబర్ 31
సన్ నెక్ట్స్
బ్లాక్ మెయిల్ (మూవీ) – అక్టోబర్ 30
జీ 5:
మారిగల్లు – అక్టోబర్ 31
ఈ వారం థ్రిల్లర్, డ్రామా, యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో ప్రేక్షకుల కోసం వేర్వేరు వేదికల్లో విభిన్న చిత్రాలు అలరించడానికి సిద్ధమయ్యాయి.మీరు మీకు నచ్చిన సినిమా చూసి ఎంజాయ్ చేయండి.