OTT | ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు కొత్త మూవీస్ థియేటర్స్, ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా నుంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ వరకూ పలు చిత్రాలు ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాయి. కేసరి చాప్టర్ 2, ‘వైభవం’, ‘ఏస్’ వంటి చిత్రాలు థియేటర్లో సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఓటీటీలలో చూస్తే.. నెట్ ఫ్లిక్స్ లో కేర్ బియర్స్ (ఇంగ్లిష్ మూవీ – మే 19), స్నీకీ లింక్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్ – మే 21), రియల్ మెన్ (ఇటాలియన్ సిరీస్ – మే 21), ఫియర్ స్ట్రీట్ (ఇంగ్లిష్ మూవీ – మే 22), సైరెన్స్ (ఇంగ్లిష్ సిరీస్ – మే 22), స్కేర్ క్రో (మే 22), హ్యామీ మండేస్ (మే 22), ఎయిర్ ఫోర్స్ ఎలైట్ (ఇంగ్లిష్ మూవీ – మే 23), ఫర్ గాట్ యూ నాట్ (చైనీస్ సిరీస్ – మే 23) నుండి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో – మోటార్ హెడ్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్ – మే 20), డయానే వారెన్ (ఇంగ్లిష్ మూవీ – మే 20), ది లెజెండ్ ఆఫ్ ఓచి (ఇంగ్లిష్ మూవీ – మే 20), ది ట్రబుల్ విత్ జెస్సికా (ఇంగ్లిష్ మూవీ – మే 20), వెర్మిగ్లియో (ఇంగ్లిష్ మూవీ – మే 20), అభిలాషం (మలయాళం మూవీ – మే 23), చీచ్ అండ్ చాంగ్ లాస్ట్ (ఇంగ్లిష్ మూవీ – మే 23) నుండి స్ట్రీమింగ్ కానున్నాయి. జియో హాట్ స్టార్ – ల్యాండ్ మ్యాన్ (వెబ్ సిరీస్ – మే 21), హార్ట్ బీట్ 2 (తెలుగు సిరీస్ – మే 22), ఫైండ్ ది ఫర్జీ (హిందీ రియాల్టీ షో – మే 23), ఈటీవీ విన్ – కథాసుధ – కాలింగ్ బెల్, నాతి చరామి స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ వారం థియేటర్లలో కొన్ని ఆసక్తికర చిత్రాలు విడుదల కానుండగా వాటి మధ్య పోటీ కూడా గట్టిగానే ఉంటుంది. అక్షయ్ కుమార్, విజయ్ సేతుపతి, రాజ్ కుమార్ రావు లాంటి క్రేజీ హీరోలు నటించిన చిత్రాలు చూసేందుకు తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తిగానే ఉన్నారు. ఆర్ముగ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఏస్ చిత్రంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, యంగ్ హీరోయిన్ రుక్మిణి నటించగా, మే 23న ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన కేసరి చాప్టర్ 2 చిత్రం ఆల్రెడీ హిందీలో విడుదలై ప్రశంసలు దక్కించుకుంది. మే 23న సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రాజ్ కుమార్ రావు, వామిక గబ్బి జంటగా నటించిన భూల్ చుక్ మాఫ్ చిత్రం మే 23న థియేటర్స్లో సందడి చేయనుంది.