OTT | ప్రతి వారం థియేటర్‌తో పాటు ఓటీటీలో వైవిధ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ మధ్య ఎలాగూ కంటెంట్ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చూసేస్తున్నారు. అయినా సరే తెలుగు సినిమాల కోసం మాత్రమే ఎదురు చూసేవాళ్లు లేకపోలేదు. అయితే ప్రతి వారం కూడా ఇటు థియేటర్స్, అటు ఓటీటీలో ప్రేక్షకులకి కావల్సినంత వినోదం అందుతుంది. గత వారం థియేటర్లో సింగిల్, శుభం చిత్రాలు మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలొక సుందరి రీరిలీజ్‌లో కూడా దూసుకుపోతుంది. ఈ వారం మాత్రం థియేటర్స్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలు రావడం లేదు.
ఓటీటీల విషయానికి వస్తే.. హాట్ స్టార్ లో ద లార్డ్ ఆఫర్ ద రింగ్స్ : ద వార్ ఆఫ్ ద రోహ్రిమ్.. ఇంగ్లీష్ సినిమా.. మే 13 నుండి స్ట్రీమ్ కానుండగా, హై జునూన్.. హిందీ సిరీస్.. మే 16 నుండి, వూల్ఫ్ మ్యాన్.. ఇంగ్లీష్ సినిమా.. మే 17 నుండి స్ట్రీమ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ లో చూస్తే.. భోల్ చుక్ మాఫ్.. హిందీ మూవీ.. మే 16 నుండి స్ట్రీమ్ కానుండగా, ప్రతినిరపరాధి యానో.. మలయాళీ సినిమా.. మే 12 నుండి స్ట్రీమ్ కానుంది. ఇక సన్ నెక్ట్స్ లో చూస్తే.. నెసిప్పయ.. తమిళ సినిమా.. మే 16 నుండి స్ట్రీమ్ అవుతుంది.
ఇక బుక్ పై షో లో సలటేసలనటే.. మరాఠీ సినిమా.. మే 13 నుండి స్ట్రీమ్ కానుండగా, సోనీలివ్ లో మరణమాస్.. తెలుగు డబ్బింగ్.. మే 15 నుండి , నెట్ ఫ్లిక్స్ లో సీ4 సింటా.. తమిళ సినిమా.. మే 12 నుండి స్ట్రీమ్ కానుంది. ఇదిలా ఉంటే.. కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించగా.. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రేక్షకులకి మంచి వినోదం పంచింది.