OTT | ప్రతి వారం థియేటర్‌తో పాటు ఓటీటీలో వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం సినీ ప్రియులను అలరించేందుకు బోలెడంత ఎంటర్ టైన్మెంట్ సిద్ధంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ హరిహర వీరమల్లు జూలై 24న థియేటర్స్ లో విడుదల కానుండగా, ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హోంబోలే ఫిలిమ్స్ రూపొందించిన ‘మహా అవతార్ నర్సింహ’ జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ మహావిష్ణువు పది అవతారాల ఆధారంగా రూపొందిన ఈ సీరీస్ మొత్తం 7 భాగాలుగా రానుంది.
విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా తమిళ చిత్రం ‘సర్ మేడమ్’ నటించిన జూలై 25న థియేటర్స్ లోకి రానుంది. షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించిన సూత్రవాక్యం చిత్రం ఇప్పటికే మలయాళంలో విడుదల కాగా.. జులై 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. తలైవన్ తలైవన్(తమిళ్) చిత్రం జూలై 25 న విడుదల కానుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ చూస్తే.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో టిన్ సోల్జర్ ( హాలీవుడ్) : జూలై 23 నుండీ స్ట్రీమింగ్ కానుంది. జస్టిన్ ఆన్ ట్రయల్( వెబ్ సిరీస్) : జూలై 21 నుండి స్ట్రీమ్ కానుండగా, రంగీన్( వెబ్ సిరీస్) : జూలై 25 నుండి, మార్గన్ : జూలై 25 నుండి, మెటీరియలిస్ట్స్ : జూలై 22 నుండీ రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ కానుంది
ఇక డెంజర్ యానిమల్స్ : జూలై 22 నుండీ నుండి స్ట్రీమింగ్ కానుంది. జియో హాట్ స్టార్‌లో సర్జమీన్ : జూలై 25 నుండీ స్ట్రీమ్ కానుండగా, రాంత్ (మలయాళం) : జూలై 22 నుండి, వాషింగ్టన్ బ్లాక్ : జూలై 23 నుండి, ద సొసైటీ : జూలై 21 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక నెట్ ఫ్లిక్స్ లో లెటర్స్ ఫ్రం ది పాస్ట్ ( టర్కిష్ సిరీస్) : జూలై 23 నుండి స్ట్రీమ్ కానుండగా, ట్రిగర్ ( కొరియన్ సిరీస్) : జూలై 25 నుండి, డిటెక్టివ్ కానన్ కలెక్షన్ 4 : జూలై 25 నుండి, మండల మర్డర్స్: జులై 25 నుండి, ద హంటింగ్ వైవ్స్- జూలై 21 నుండి, మై మెలోడీ & కురోమి – జూలై 24 నుండి, ట్రైన్ రెక్: పీఐ మామ్స్ – జూలై 22 నుండి, క్రిటికల్: బిట్విన్ లైఫ్ అండ్ డెత్ – జూలై 23 నుండి, హిట్ మేకర్స్ – జూలై 24నుండి, ట్రిగ్గర్- జూలై 25 నుండి స్ట్రీమ్ కానుంది.