OTT | దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకులకి మంచి వినోదం పంచే ఉద్దేశంతో ఇటు థియేటర్, అటు ఓటీటీలో వైవిధ్యమైన సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. నవ్వులు, ప్రేమ, స్నేహం నేపథ్యంలో రూపొందిన చిత్రాలు థియేటర్స్‌లో మంచి వినోందం అందించనున్నాయి. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం, విష్ణు ఓఐ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్రెండ్షిప్ కామెడీ డ్రామా మిత్ర మండలి అక్టోబర్ 16న రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతూ తీసిన మొదటి సినిమా తెలుసు కదా. సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ట్రయాంగిల్ ప్రేమకథ, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ డ్రామాగా రూపొందింది. అక్టోబర్ 17న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ సినిమా తెలుగులో అక్టోబర్ 17న విడుదలవుతోంది. మమితా బైజు హీరోయిన్. కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసిన ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కించారు దర్శకుడు కీర్తీశ్వరన్. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కె ర్యాంప్ అనే రొమాంటిక్ కామెడీ చిత్రం అక్టోబన్ 18న రిలీజ్ కానుంది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇక ఓటీటీలోను మంచి సందడి నెలకొంది. ఓటీటీలో రానున్న సినిమాలు & వెబ్‌సిరీస్‌లు చూస్తే..
జీ5:
కిష్కిందపురి – అక్టోబర్ 17
భగవన్ చాప్టర్ 1: రాక్షస్ (హిందీ మూవీ) – అక్టోబర్ 17
ఎలమలే ( కన్నడ సినిమా)- అక్టోబర్ 17
మేడమ్ సేన్ గుప్తా ( బెంగాలీ మూవీ)- అక్టోబర్ 17
అభయంతర కుట్టవాళి( మలయాళ సినిమా)- అక్టోబర్ 17
ఆహా:
ఆనందలహరి (సిరీస్) – అక్టోబర్ 17
సన్ నెక్ట్స్
ఇంబమ్ ( మలయాళ చిత్రం) – అక్టోబర్ 17
హాట్ స్టార్
హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ ( తెలుగు డబ్బింగ్ సినిమా)- అక్టోబర్ 13
ఫైనల్ డెస్టినేషన్ : బ్లడ్ లైన్స్ ( తెలుగు డబ్బింగ్ చిత్రం) – అక్టోబర్ 16
సైక్లింగ్ రెస్క్యూ ( చైనీస్ మూవీ) – అక్టోబర్ 16
లయన్స్ గేట్ ప్లే
సంతోష్ ( హిందీ సినిమా)- అక్టోబర్ 17
వుయ్ లివ్ ఇన్ టైమ్ ( ఇంగ్లీష్ మూవీ) – అక్టోబర్ 17
అమెజాన్ ప్రైమ్ వీడియో:
పరమ్ సుందరి – స్ట్రీమింగ్‌లో ఉంది (రెంట్ పై లభ్యం)
ది మలబార్ టేల్స్ (మూవీ) కన్నడ
రిప్పాన్ స్వామి (మూవీ) కన్నడ
మెయింటెనెన్స్ రిక్వైర్డ్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
టు డై అలోన్ (మూవీ) ఇంగ్లీష్
ది థికెట్ (మూవీ) ఇంగ్లీష్
జమ్నాపార్ (వెబ్‌సిరీస్: సీజన్2) హిందీ
వెడ్డింగ్ ఇంపాసిబుల్ (వెబ్‌సిరీస్: సీజన్1) కొరియన్/తెలుగు
నెట్‌ఫ్లిక్స్ :
ఎవ్రిబడి లవ్స్ మూవీ వెన్ ఐయామ్ డెడ్ ( థాయ్ సినిమా)- అక్టోబర్ 14
ఇన్సైడ్ ప్యూరియోజా ( పోలిష్ మూవీ)- అక్టోబర్ 15
ద ట్విట్స్ ( ఇంగ్లీష్ సినిమా – అక్టోబర్ 16
ది డిప్లొమ్యాట్ సీజన్ 3 – అక్టోబర్ 16
గుడ్‌న్యూస్ – అక్టోబర్ 17
27 నైట్స్ ( స్పానిష్ మూవీ)- అక్టోబర్ 17
గ్రేటర్ కాలేష్ ( హిందీ సిరీస్)- అక్టోబర్ 17
షీ వాక్స్ ఇన్ డార్క్నెస్ ( స్పానిష్ సినిమా)- అక్టోబర్ 17
ద పర్ఫెక్ట్ నైబర్ ( ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 17
ఈ దీపావళికి అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా వినోదం ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది. పండగ సమయంలో కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి ఇది మంచి అవకాశం