Jigirs Movie | ఓటీటీ వేదికగా విడుదలైన ‘జిగ్రిస్’ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో కృష్ణ బురుగుల అందించిన కామెడీ పండగ సీజన్లో ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచుతోంది. సాధారణంగా ఒక సినిమాను ఒకసారి చూడటమే గొప్ప, కానీ కృష్ణ అద్భుతమైన కామెడీ టైమింగ్ కోసం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తుండటం విశేషం. సినిమా ప్రారంభం నుండి ఇంటర్వెల్ వరకు కృష్ణ బురుగుల తన మార్క్ మ్యానరిజమ్స్ మరియు పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నారు. ఈ చిత్రానికి వస్తున్న ఆర్గానిక్ రెస్పాన్స్ చూస్తుంటే కృష్ణ బురుగుల ఇప్పుడు “ఓటీటీ కామెడీ కింగ్”గా అవతరించారని చెప్పవచ్చు. ఒక అభిమాని సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “నీ యాక్టింగ్ మరియు కామెడీ టైమింగ్ కోసం ఈ సినిమాను ఇప్పటికే 4 సార్లు చూశాను కృష్ణ అన్న.. నువ్వు నిజంగా తోపు” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
కేవలం యూత్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కృష్ణ బురుగుల కామెడీకి ఫిదా అయిపోతున్నారు. సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ, ‘జిగ్రిస్’ తనదైన శైలిలో వినోదాన్ని పంచుతూ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. భవిష్యత్తులో కృష్ణ బురుగుల మరిన్ని భారీ ప్రాజెక్టులతో వెండితెరపై కూడా సందడి చేయాలని ఆశిద్దాం.