Operation Raavan | పలాస మూవీ ఫేమ్ రక్షిత్ అట్లూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆపరేషన్ రావణ్(). ఈ సినిమాకు వెంకట సత్య దర్శకత్వం వహిస్తుండగా.. ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నాడు. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుండగా.. కోలీవుడ్ సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను వదిలారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచుతామని త్వరలోనే టీజర్‌తో పాటు ట్రైలర్లను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.