Ooru Peru Bhairavakona | టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona). ఫాంటసీ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ నుంచి వరుస అప్డేట్లు ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ‘హరోంహర’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ పాటను చైతు సత్సంగి పాడడంతో పాటు లిరిక్స్ అందించగా.. శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.
ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా తెరకెక్కిస్తున్నారు. టైగర్ తర్వాత సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సారి ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న వీఐ ఆనంద్ ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేస్తాడని ఎక్జయిటింగ్‌గా చూస్తున్నారు.