balasubrahmanyam: బాలు మరణించి అప్పుడే ఏడాది అయిందా?

తన గానంతో కోట్లాది శ్రోతలని పరవశింపజేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం. ఎస్పీ బాలు పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం. ఆయితే అందరికీ ఆయన బాలుగా సుపరిచితుడు. పాటలు పాడడమే కాక సంగీత దర్శకత్వం కూడా వహించిన ఆయన నిర్మాతగాను తన సత్తా చూపించారు. మిథునం ఆయనకు నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా బాలు పని చేశారు.
తెలుగు, తమిళంతోపాటు కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రధానంగా ఆయన పాటలు వినిపిస్తాయి. మొత్తంగా చూస్తే 16కుపైగా భాషల్లో ఆయన పాటలు పాడారు. 40,000కుపైగా పాటలు పాడి ఆయన గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆయన కెరీర్ అప్రతిహాతంగా సాగుతున్న వేళ బాలుకి కరోనా సోకింది.ఆగస్ట్ 5, 2020న తనకు కరోనా సోకిందని చెప్పిన బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
శుక్రవారం(సెప్టెంబరు 25,2020) మధ్యాహ్నం 1.04 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు ఎంజీఎం హెల్త్కేర్ ఆసుపత్రి తెలిపింది. ఈ వార్తతో అందరి గుండెలు పగిలాయి. బాలు ఇక మన మధ్య లేడనే వార్తని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. నీవు లేకపోయినా..నీ పాట ఆ చంద్రతారార్కం నిలిచే ఉంటుందంటూ తోటి గాయకులు, సినీ సంగీతాభిమానులు బరువైన గుండెతో కన్నీటి వీడ్కోలు పలికారు.బాలు మరణించి ఏడాది పూర్తైన సందర్భంగా ఈ రోజు ఆయన సంస్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తూ బాలు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

