Kurchi Madathapetti | కేరళలో ప్రస్తుతం ఓనం పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మలయాళీలకు అతిపెద్ద పండుగలలో ఒకటైన ఈ పండుగ ఈ ఏడాది ఆగష్టు 26న మొదలై సెప్టెంబర్ 05న ముగుస్తుంది. దీంతో చిన్నపిల్లల నుంచి, విద్యార్థులు, పెద్దల వరకు అందరూ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా కేరళలోని ఒక కాలేజ్లో ఓనం సెలబ్రేషన్స్ జరుగగా.. ఈ వేడుకలో తెలుగులో చార్ట్ బస్టర్గా నిలిచిన కుర్చీ మడతబెట్టి పాటకు డ్యాన్స్ చేసి మలయాళీ ముద్దుగుమ్మలు అలరించారు.
సాధారణంగా ఓనం రోజు కేరళీయులు పులికళి, తిరువతిరకళి వంటి సంప్రదాయ నృత్యాలతో అలరిస్తారు. కానీ ఈసారి మలయాళీ యువతులు తెలుగు సినిమా పాటలకు వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతబెట్టి’ పాటకు క్రేజీగా డాన్స్ చేయడంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Muslim girls performing onam dance in Kerala. pic.twitter.com/5nzlEu50t1
— Desi king (@DesiKing_) August 31, 2025