Viral Vayyari Song | దేవి శ్రీ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు జనాల్లోకి ఇట్టే చేరతాయి. ఆయన సంగీతం అందించిన తాజా చిత్రం జూనియర్. పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రజనీ కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటించింది. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ కార్యక్రమానికి అగ్ర దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు.
ఇక ఈ సినిమాలోని “వైరల్ వయ్యారి నేనే… వయసొచ్చిన అణుబాంబును” అనే సాంగ్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ప్రతి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఈ పాటకు సంబంధించిన స్టెప్పులు, డ్యాన్స్ వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పాటకి కాలు కదుపుతూ అదరగొడుతున్నారు. తాజాగా ఓ వృద్ధురాలు ఈ పాటకి ఎనర్జిటిక్‌గా స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఇప్పుడు ఈమెకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. వృద్ధురాలి జోష్ చూసిన ప్రముఖ యాంకర్ సుమ కూడా ఆమెతో కలిసి స్టేజ్ మీద స్టెప్పులేశారు.
‘జూనియర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇది చోటు చేసుకోగా, ప్రతి ఒక్కరు ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే ఈ బామ్మ మరెవరో కాదు. బామ్మ పాత్రలతో ప్రేక్షకుల మనసు దోచిన మణి .నెటిజన్లు “బామ్మ ఎనర్జీ వేరే లెవెల్” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక జూనియర్ చిత్రం విషయానికి వస్తే.. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘వైరల్ వయ్యారి’ సాంగ్ ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. శ్రీలీల స్టెప్పులకు యూత్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ మూవీపై భారీ అంచనాలు పెంచింది.
Good music and good vibe has no age barrier ❤️
The most viral dance for #ViralVayyari at the #Junior Grand Pre Release Event ❤🔥
Watch live now!
▶️ https://t.co/XiLs4gDSed#Junior Grand release on July 18th ✨#JuniorOnJuly18th #JuniorPreReleaseEvent pic.twitter.com/JSCTs2onDa— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) July 16, 2025