Bro Movie | ‘బ్రో’ నుంచి ఎమోషనల్ వీడియో సాంగ్ రిలీజ్..!
Okasaari Putti | పవన్‌కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్‌తేజ్(Sai Dharam Tej) కలయికలో రూపొందిన చిత్రం ‘బ్రో (BRO)’. ఈ సినిమాలో ఒకసారి పుట్టి (Okasaari Putti) అనే పాటకు థియేటర్లో ప్రేక్షకులు ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
Okasaari Putti | పవన్‌కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్‌తేజ్(Sai Dharam Tej) కలయికలో రూపొందిన చిత్రం ‘బ్రో (BRO)’. తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తమ్ (Vinodaya Sittham) సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖనే (Samudrakhani) రీమేక్ వెర్షన్‌ను కూడా తెరకెక్కించాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్ (Trivikram) పలు మార్పులు చేర్పులు చేశాడు. తమిళంలో తంబిరామయ్య (Thami Ramaiah) పోషించిన పాత్రను ఇక్కడ సాయి ధరమ్ తేజ్ చేయగా.. దేవుడిగా పవన్ కళ్యాణ్ నటించాడు. ఇక మూడు వారాల కిందట రిలీజైన ఈ సినిమా తొలిరోజే రూ.30 కోట్ల షేర్‌ను కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర పవన్ మేనియా ఏంటో మరోసారి నిరూపించింది. టాక్ కాస్త అటు ఇటు వచ్చినా.. ఫ్యాన్స్‌కు కావాల్సిన స్టఫ్ ఉండటంతో విచ్చలవిడిగా కలెక్షన్లు వచ్చి పడ్డాయి. కాగా ఈ సినిమాలో ఒకసారి పుట్టి (Okasaari Putti) అనే పాటకు థియేటర్లో ప్రేక్షకులు ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
‘నాది నాదన్నది ఏది, నీతో రాలేను అంది, రాసుంది లే ముందే ఈ సమయం. తెలుసున్నదే తప్పదని పయనం నూరేళ్ళు కొన్నాళ్ళు ఈ దేహము, విడిచెళ్లీ పోతుంది ఈ ప్రాణము కను తెరిచి మూసేటి ఆటే కదా కన్నీరుగా జారీ పోయే కథ ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధము’. అంటూ సాగిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా.. రవి జీ ఆలపించాడు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను కూడా లాక్ చేసుకుంది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.
#OkasaariPutti Full Video Song from #BROTheAvatar out now on @MangoMusicLabel
👉https://t.co/ufOsajjnXD🎵 🎶A @MusicThaman‘s Musical Treat! 🎼
🖋️ by @LyricsShyam
🎤 by #RaviG@PawanKalyan @IamSaiDharamTej @TheKetikaSharma @thondankani @peoplemediafcy @vishwaprasadtg… pic.twitter.com/rnMiPcxES4— Vamsi Kaka (@vamsikaka) August 23, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

