Oka Parvathi Iddaru Devadasulu | మాహిష్మతి ప్రొడక్షన్స్ పతాకంపై తోట రామకృష్ణ దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు(Oka Parvathi Iddaru Devadasulu). ఈ చిత్రంలో సిద్ధార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా నటిస్తుండగా.. రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ యువతను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం తెలియజేసింది. ఈ చిత్రంలో రఘుబాబు, కశిరెడ్డి రాజ్‌కుమార్, వీర శంకర్, గౌతం రాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవితేజ, రజిత వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మోహిత్ రహమానియాక్ స్వరాలు అందిస్తున్నారు. ఆస్కార్ విజేత చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల వంటి ప్రముఖ గీత రచయితలు పాటలు రాశారు. శ్రీనివాసరాజు సినిమాటోగ్రఫీ, గన్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. శరత్ వర్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. పీఆర్ఓలు గణేష్, కుమార్.