Oh My God-2 Movie Censor | దేవుడి కాన్సెప్ట్‌తో తెరకెక్కే సినిమాలకు మాములుగా క్లీన్ యూ సర్టిఫికేట్ వస్తుంది. కొన్ని సినిమాలకు మాత్రం యూ/ఏ సర్టిఫికేట్ వస్తుంది. అయితే అక్షయ్ కుమార్ దేవుడిగా చేస్తున్న ఓ మై గాడ్ సినిమాకు మాత్రం సెన్సార్ ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. ఏ సర్టిఫికేట్ అంటే అడల్ట్స్ ఓన్లీ అని. ఒక దేవుడు సినిమాకు అడల్ట్స్ ఓన్లీ అని సర్టిఫికేట్ ఇవ్వడం బహుశా ఇదే తొలిసారేమో. అంతలా అసభ్యకరమైన సన్నివేశాలు ఏమున్నాయా అని సినీ లవర్స్ అంతా ఆలోచిస్తున్నారు. ముందుగా ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్రయూనిట్‌కు ఏకంగా 20 కట్స్‌ను రికమెండ్ చేశారు.
ఆ కట్స్‌కు ఒప్పుకోని పక్షంలో ఏ సర్టిఫికేట్‌ను ఇస్తామని నిర్మాతలకు సెన్సార్ ముందే చెప్పింది. అయితే చిత్రయూనిట్ ఆ కట్స్‌కు నిరాకరించిందట. అందులో అంత అసభ్యం ఏమి లేదని, అవి సినిమాకు చాలా ముఖ్యమని వివరణ చెప్పే ప్రయత్నం చేశారట. కానీ సెన్సార్ దానికి ఒప్పుకోలేదట. దాంతో ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ సినిమా రన్‌టైమ్ 2గంటల 36 నిమిషాలు ఉండనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన ఓ మై గాడ్ సినిమాకు రీమేక్‌గా వస్తుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ దేవుడిగా కనిపించనున్నాడు.
కాగా ఈ సినిమాలో అమిత్రాయ్ కంట్రవర్సీ అంశాలను పొందుపరచాడని, కులాలు మతాలకు సంబంధించిన కొన్ని విషయాలను టచ్ చేశాడని బాలీవుడ్ వర్గాల టాక్. అందుకే ఈ సినిమాకు సెన్సార్ ఏ సర్టిఫికేట్‌ను జారి చేసిందని సమాచారం. పంకజ్ త్రిపాఠి మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో యామీ గౌతమ్ కీలకపాత్ర పోషిస్తుంది. వాకావ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. గత ఏడాది అక్షయ్‌కు మాములు డిజాస్టర్లు పడలేదు. సామ్రాట్ పృథ్విరాజ్, రక్షా బంధన్, బచ్చన్ పాండే, రామ్ సేతు ఓ రేంజ్లో దెబ్బ కొట్టాయి. ఇక్కడ బెల్లంకొండ చేసిన రాక్షసుడు హిందీ రీమేక్ కట్ పుత్లీని తెలివిగా ఓటిటి రిలీజ్ చేశారు కాబట్టి బ్రతికిపోయింది కానీ లేదంటే దాని పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. ఆఖరికి మలయాళ బ్లాక్‌బస్టర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను నమ్ముకుని తీసిన సెల్ఫీ కూడా అక్షయ్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది.
#Xclusiv… ‘OMG 2’ RUN TIME… #OMG2 certified ‘A’ by #CBFC on 31 July 2023. Duration: 156.10 min:sec [2 hours, 36 min, 10 sec]. #India
⭐ Theatrical release date: 11 Aug 2023.#AkshayKumar #PankajTripathi #YamiGautam pic.twitter.com/yG6aBqEYDw
— taran adarsh (@taran_adarsh) August 1, 2023