Akshay Kumar | అక్షయ్‌కుమార్, పరేష్‌రావల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఓ మై గాడ్-2’. అమిత్రాయ్ దర్శకుడు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తొలిభాగం ‘ఓ మైగాడ్’లో అక్షయ్‌కుమార్ కృష్ణుడి పాత్రను పోషించగా…సీక్వెల్లో శివుడి పాత్రలో కనిపించబోతున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 27 కట్స్ విధించింది. సంభాషణల్లో చాలా మార్పులను సూచించింది.
అక్షయ్‌కుమార్ పోషిస్తున్న శివుడి పాత్రను మెసేంజర్ ఆఫ్ గాడ్‌గా మార్చాలని సెన్సార్ బోర్డ్ ఆదేశించింది. సినిమాలో ఉపయోగించిన శివ్లింగ్, భగవద్గీత, ఉపనిషత్, అధర్వవేద, రాసలీల వంటి పదాలను కూడా తొలగించాలని కోరింది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో అక్షయ్‌కుమార్ నాగసాధు రూపంలో శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా కనిపిస్తారని తెలిసింది. ఆ విజువల్స్‌ను బ్లర్ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డ్ సూచించింది. అక్షయ్‌కుమార్ దేవుడి పాత్రను పోషిస్తున్న దృష్ట్యా ఆయనకు సంబంధించిన మద్యపాన దృశ్యాలను పూర్తిగా తొలగించాలని సెన్సార్ వారు ఆదేశించినట్లు తెలిసింది. దాదాపు 15 నిమిషాల నిడివిగల కంటెంట్ సెన్సార్‌కు గురైందని చిత్ర బృందం పేర్కొంది. సినిమా ఈ స్థాయిలో సెన్సార్ కట్స్ బారిన పడటంతో చిత్ర బృందం అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.