Oh Bhama Ayyo Rama Theatrical Trailer | సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్(Suhas) తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (Malavika Manoj) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల( Ram Godhala) దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. జులై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తుంటే.. ఇదొక క్యూట్ అండ్ ఎంటర్టైనింగ్ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్‌లోని ప్రతి ఫేమ్ కలర్ఫుల్గా ఉంది. సుహాస్ ఎంతో ఎనర్జీగా కనిపించాడు. హీరోయిన్ మాళవిక, హీరో సుహాస్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో వినోదాన్ని పంచాయి. ఇక ఈ చిత్రంలో దర్శకులు హరీశ్ శంకర్, మారుతి అతిథి పాత్రల్లో మెరవబోతున్నారు.