టాలీవుడ్ (Tollywood) బ్యూటీ సమంత (Samantha ) కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది ఓ బేబి. లేడీ డైరెక్టర్ నందినీరెడ్డి ఈ చిత్రంతో మరోసారి తన టాలెంట్ ను ప్రేక్షకులకు చూపించింది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ తో కలిసి గురు ఫిల్మ్స్ (Guru Films) ఈ చిత్రాన్ని నిర్మించింది. తాజాగా ఓ ఆసక్తికరమైన అప్ డేట్ బయటకు వచ్చింది. ఓ బేబి మేకర్స్ అంతర్జాతీయ సినిమాను ప్రకటించారు.
గురు ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ (Arrangements of Love) టైటిల్ ను ఖరారు చేశారు. భారతీయ రచయిత టిమేరి మురారి రాసిన ఉత్తమ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కథ, దర్శకుడు ఫిలిప్ ఆర్ జాన్…కాగా సునీత తాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నటీనటులతో కూడిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలో స్పష్టత రానుంది.
ఫాంటసీ కామెడీ సినిమాగా వచ్చిన ‘ఓ బేబి’ లోనాగశౌర్య, ఊర్వశి, లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, తేజ సజ్జ కీలక పాత్రల్లో నటించారు. 2014 సౌత్ కొరియన్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్ గా తెరకెక్కిందీ చిత్రం. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. మరి ఓ బేబి లాంటి హిట్ అందించిన గురు ఫిల్మ్స్ Arrangements of Love తో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
After the successful #OhBaby @gurufilms1 announces their International project #ArrangementsofLove, an adaptation of the bestselling novel by Indian author @TimeriMurari
— BA Raju's Team (@baraju_SuperHit) August 31, 2021
Directed & written by @philiprjohn
Co-written by @NimmiHarasagama
Produced by @SunithaTati on @GuruFilms1 pic.twitter.com/zxc0E9UA8s
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
మరో రీమేక్‌లో మెగాస్టార్ .. సొంత కథలపై చిరంజీవికి నమ్మకం పోయిందా ?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్