పవన్‌కల్యాణ్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. సోషల్‌మీడియాలో అది వైరల్‌గా మారింది. దాంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ఎప్పుడొస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 15న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారని తెలిసింది.
ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ ఓజస్ గంభీర అనే పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని, పవన్‌కల్యాణ్ అభిమానులకు ఓ పండగలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్‌రాజ్, శ్రియారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాతలు: డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి, దర్శకత్వం: సుజీత్.