They Call Him OG | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ ‘ఓజీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా రిలీజ్‌కు ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ట్రైలర్‌ను కొన్ని గంటలు వాయిదా వేసినట్లు తెలిపింది. ఈ మూవీ ట్రైలర్‌ను నేడు సాయంత్రం జరిగే ‘ఓజీ’ కాన్సర్ట్‌లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
సెప్టెంబర్ 21న సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘ఓజీ’ కాన్సర్ట్‌ను నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమం ప్రధానంగా పాటల విడుదల వేడుకగా భావిస్తున్నారు. ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ హాజరవుతారా లేదా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే చిత్ర యూనిట్‌లోని మిగతా సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పవన్ రాకపై క్లారిటీ వస్తే ఈ కాన్సర్ట్ మరింత గ్రాండ్‌గా మారే అవకాశం ఉంది.
Ok Ok. Music start in replies and quotes… . #OGTrailer will be released today at the #OGConcert event. pic.twitter.com/oFQOMI0n46
— DVV Entertainment (@DVVMovies) September 21, 2025