Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారం ముగింపు దశకి చేరింది. మొదటి వారం ఊహించినట్టుగా పెద్దగా హైప్ లేకుండా స్లో అండ్ స్టడీగా నడిచిన, రెండో వారం మాత్రం గ్రూప్ పాలిటిక్స్, పులిహోర ట్రాక్స్, కామెంట్స్, లవ్ కోణాలతో ఇంట్రెస్టింగ్గా సాగింది. ఇక శనివారం రాత్రి ప్రీ ఎలిమినేషన్ సీన్స్ ఆదివారం ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచాయి. అయితే ఇంటి నుంచి రెండో ఎలిమినేట్ ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తిగా ఎదురు చూడగా, ఈ రోజు మర్యాద మనీష్ హౌజ్ నుండి బయటకు వస్తాడని అని సమాచారం వెలువడుతోంది.
రెండో వారం ఎలిమినేషన్లో ఎనిమిది మంది నామినేట్ అవగా, మొదటినుంచి ఓటింగ్ పరంగా వెనకబడ్డ ప్రియా ఎలిమినేట్ అవుతుందనే ప్రచారం జోరుగా నడిచింది. కానీ చివరి రెండు రోజుల్లో ఆమెకు ఓటింగ్ పెరిగింది. సోషల్ మీడియా క్యాంపెయిన్లు, సింపతీ వేవ్ ఆమెను టాప్ 2 వరకు తీసుకెళ్లాయి. దీంతో ఎలిమినేషన్ ఖాయం అనుకున్న ప్రియా ఎస్కేప్ అయ్యింది. దీంతో మర్యాద మనీష్ ఎలిమినేట్ కానున్నాడని అంటున్నారు. మొదటగా హౌజ్‌లోకి వచ్చిన అతనికి పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడంతో పాటు, గేమ్‌లోనూ అంతగా ఆకట్టకపోవడంతో ఓటింగ్‌లో వెనుకబడ్డాడు. చివరి నిమిషంలో ప్రియా లిఫ్ట్ అవ్వడంతో, అతనికి ఎలిమినేషన్ తప్పలేదు.
మనీష్ బిగ్ బాస్ హౌజ్‌లోకి స్వయంగా రాలేదు. తొలి వారంలో శ్రీముఖి చివరి కంటెస్టెంట్‌ను ఎంపిక చేయాల్సి ఉండగా, ఆమె మనీష్‌ను ఎంపిక చేసింది. అప్పటికి అభిజీత్ కూడా అతనికి సపోర్ట్ చేశారు. దీనిని బట్టి నాగార్జున కూడా ఆయనను ఇంటి సభ్యుడిగా ఎంపిక చేశారు. కానీ రెండో వారంలోనే ఎలిమినేట్ కావడంతో, శ్రీముఖి ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. ఈ వారం నామినేషన్లో ఉన్నవారు ఎవరనేది చూస్తే.. భరణి, మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియా, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ ఉన్నారు. ఈ వారంలో సుమన్ శెట్టి టాప్ ఓటింగ్ పొందగా, భరణి, డీమాన్ పవన్, ఫ్లోరా కూడా మంచి ఓటింగ్‌తో సేఫ్ జోన్లోకి వెళ్లారు. హరీష్‌పై సింపతీ వర్కౌట్ కావడంతో ఆయన కూడా బలంగా నిలిచాడు. మొత్తానికి, బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం అంచనాలకు భిన్నంగా మర్యాద మనీష్ ఎలిమినేట్ కావడం, ప్రియా సేఫ్ అవడం షాకింగ్‌గా మారాయి. వచ్చే వారం ఎంట్రీ ఇచ్చే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లతో గేమ్ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశముంది.