Idli Kottu | తమిళ అగ్ర హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించి, ఆకాష్ భాస్కరన్‌తో కలిసి నిర్మించిన తమిళ సినిమా ‘ఇడ్లీ కడై’. ఈ సినిమా.. ‘ఇడ్లీ కొట్టు’ పేరుతో అక్టోబర్ 1న తెలుగులో విడుదల కానుంది. శ్రీ వేదక్షర మూవీస్ పతాకంపై నిర్మాత రామారావు చింతపల్లి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దర్శకుడిగా ధనుష్ నాలుగో సినిమా ఇది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘మిషన్లతో అన్నీ చేసేయొచ్చు అంటారు కానీ రుచి అనేది మాత్రం.. మనసు పెడితేనే వస్తుంది. జీవితంలో మనం చేసే పనిని ఆదాయం కోసం మాత్రమే కాదు. ఆస్వాదిస్తూ కూడా చేయాలంటూ వచ్చే డైలాగ్‌లు ఈ ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. ధనుష్ ఈ సినిమాలో చెఫ్ పాత్రలో కనిపించబోతున్నాడు. నిత్యామీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రై.లిమిటెడ్.