OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘OG (ఓజీ)’ రేపు సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే రిలీజ్‌కు ముందే సినిమా మీద ఏర్పడిన హైప్ టాలీవుడ్ మొత్తాన్ని ఊపేస్తోంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు సహా టాలీవుడ్ మొత్తం OG సినిమా కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఆన్లైన్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోవడంతో ఫ్యాన్స్ ఓపెనింగ్ డేనే ఫెస్టివల్‌గా మార్చేసారు. ఇక ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని OG టీం హైదరాబాద్‌లో ఓ స్పెషల్ సెలెబ్రిటీ ప్రీమియర్ షో ప్లాన్ చేసింది.
OG సినిమాకి సంబంధించిన ప్రత్యేక ప్రీమియర్ షో నేడు (సెప్టెంబర్ 24) రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌లోని విమల్ థియేటర్ లో జరగనుంది. ఈ స్పెషల్ షోను మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం.ఈ ప్రత్యేక OG షోకు టాలీవుడ్ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారట.
ఈ లిస్టులో స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, పవన్ కుమారుడు అకిరా నందన్, ప్రశాంత్ నీల్, డైరెక్టర్లు హరీష్ శంకర్, మారుతి, SKN, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, OG మూవీ టీం మొత్తం, ప్రముఖ సింగర్స్, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు ఇలా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఈ షో కేవలం టాలీవుడ్ సన్నిహితులకి మాత్రమే అందుబాటులో ఉండబోతోంది. అయితే మూవీకి సంబంధించిన పిక్స్, రివ్యూలు తెల్లవారుఝాము వరకు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఖాయం.
OG సినిమాకి ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ నాన్-రిలీజ్ హైప్ ఏర్పడింది. ఫ్యాన్స్ ఇప్పటికే టికెట్ల కోసం క్యూ కడుతూ బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీ ప్రీమియర్ షో కూడా OG సినిమాకు మరింత బజ్ తీసుకువస్తోంది. సెలబ్రిటీ రివ్యూలు OG బాక్సాఫీస్‌ను ఇంకో లెవెల్‌కి తీసుకెళ్లే అవకాశముంది. పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్, OG గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో, ఈ ప్రీమియర్ OG విజయానికి మరింత బూస్ట్ ఇవ్వనుంది. ఇక నేడు రాత్రి నుంచి ప్రీమియర్ షోలు, రేపటి నుంచి వరల్డ్ వైడ్ రిలీజ్‌తో OG సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ ఓపెనింగ్ నమోదు చేసే అవకాశం ఉండగా, OG సినిమా ఫస్ట్ డే 100 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయం అంటున్నారు.