OG Sequel | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా ఇప్పటికే థియేటర్లలో మాస్ మానియా సృష్టిస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఇది కేవలం ఫ్యాన్స్ ఫీస్ట్ మాత్రమే కాదు, సినిమా లవర్స్‌కి కూడా స్టన్నింగ్ బ్లాక్‌బస్టర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. డైరెక్టర్ సుజీత్ టేకింగ్‌తో అదరగొట్టాడని, తమన్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచిందని ఆడియన్స్ చెబుతున్నారు. అయితే ఓజీ మానియాతోనే ఊగిపోతున్న ఫ్యాన్స్‌కి మరో సర్ప్రైజ్ దక్కింది. సినిమా ముగిసిన వెంటనే వచ్చిన ఓజీ సీక్వెల్ అనౌన్స్మెంట్ మాత్రం థియేటర్లలో పండగ వాతావరణాన్ని సృష్టించింది . సినిమా ఎండింగ్లో ‘OG 2 – COMING SOON’ అనే టైటిల్ కార్డు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది.
ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయరని భావించిన అభిమానులకు ఇది అదిరిపోయే గుడ్ న్యూస్. ఇప్పటికే పలు మీడియా హౌస్‌లు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుండగా, థియేటర్లలో కేకలు, హర్షధ్వానాలతో అభిమానులు ఆ అనౌన్స్‌మెంట్‌ను స్వాగతించారు. ‘ఓజీ’ సినిమాలో పవన్ పాత్ర ఒక జపాన్ సమురాయ్ నేపథ్యంతో కూడిన గ్యాంగ్‌స్టర్. సినిమా చివర్లో ఓజీ తన సమురాయ్ గ్రూప్‌ని మోసం చేసిన యుకుజిలపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అయితే జపాన్ యుకుజి లీడర్ ఓజీపై పగ పెంచుకుంటూ అతడిని వెతుకుతున్నట్లు చూపించారు
మరోవైపు, ముంబై గ్యాంగ్‌స్టర్ డేవిడ్ భాయ్ కూడా ఓజీ చేతిలో దెబ్బతిని అతనిపై కక్ష పెంచుకుంటాడు. వీరిద్దరూ కలసి ఓజీని చంపేందుకు ప్లాన్ చేస్తారని సంకేతాలు ఇచ్చారు. అలాగే ఓజీ జీవితంలో సత్య దాదా నుంచి విడిపోయిన తర్వాత జపాన్ వెళ్లిన గ్యాప్‌లో ఏమైందన్నది పార్ట్ 2లో వివరంగా చూపించబోతున్నారు. చూస్తుంటే, OG 2 మరింత యాక్షన్‌తో, ఎమోషన్‌తో, అంతర్జాతీయ స్థాయి స్థాయిలో తెరకెక్కబోతుందని అర్థమవుతోంది.ఇప్పటికే సోషల్ మీడియాలో #OG2, #WeWantOG2 అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. “పవన్ గారు ఇప్పటికే సినిమాలకు గుడ్‌బై చెప్పినా, OG 2 మాత్రం తప్పనిసరిగా చేయాలి” అని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.OG సీక్వెల్ తెరకెక్కిస్తే అది పవన్ కెరీర్లో మరో లెజెండరీ ఛాప్టర్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమా రావడానికి రెండేళ్లు పట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు.