OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు స్టార్ హీరోగా ప్రేక్షకులని ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో అప్పటి నుండి సినిమాలు చేయడం తగ్గించాడు. ఆయన కమిటైన ప్రాజెక్టులని కూడా పక్కన పెట్టేశాడు. ఏపీ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అందుకున్న తర్వాత నుండి పవన్ ప్రజలలోనే ఎక్కువగా ఉంటున్నాడు. దీని వలన ఆయనకి సినిమా షూటింగ్ చేసే సమయం దొరకడం లేదు. ఇక రీసెంట్గా కాస్త టైం గ్యాప్ చూసుకొని హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ పూర్తి చేశాడు. ఈ మూవీ జూన్ 12న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కగా, ఈ మూవీతో పవన్ పలు రికార్డ్స్ కొల్లగొడతాడని చర్చించుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే పవన్ ఖాతాలో ఉన్న మరో చిత్రం ఓజి. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా జరుగుతుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ షర్ట్ లెస్ ఫైట్ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓజీ సినిమాలో సుజిత్ ఓ అదిరిపోయే ఫైట్ సీన్ ను ప్లాన్ చేశారని. ఆ ఫైట్ లో పవన్ షర్ట్ లేకుండా కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉంది అనేది తెలియదు కానీ.. ఈ వార్త విని పవన్ ఫ్యాన్స్ పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా కన్ఫాం అయినట్టు ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
ప్రస్తుతం ఓజీ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో పవన్ ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ అయితే ఈ కంటెంట్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు ‘ఓజీ’ షూటింగ్ కంప్లీట్ అయితే వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ మూవీని సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అఖండ 2 కూడా అదే సమయంలో రావాలని అనుకుంది. అయితే ఈ మూవీ వాయిదా పడితే ‘ఓజీ’ని తీసుకురావాలని చూస్తున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ క్లారిటీ రానుంది.