Adhira | ఓజీ నిర్మాత కళ్యాణ్ దాసరి యాక్టర్‌గా గ్రాండ్ డెబ్యూ ఇస్తున్నాడని తెలిసిందే. కళ్యాణ్ దాసరి హీరోగా నటిస్తోన్న చిత్రం అధీరా. ప్రశాంత్ వర్మ క్రియేషన్‌లో రాబోతున్న ఈ చిత్రానికి శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్.
అధీరా మూవీ షూటింగ్‌ను జనవరి 27న గ్రాండ్‌గా మొదలుపెట్టనున్నట్టు తెలియజేశారు. కళ్యాణ్ దాసరి సూపర్ హీరో లుక్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో ఎస్జే యమ భటుడిలా సీరియస్‌గా కనిపిస్తుండటం చూడొచ్చు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలవుతుందని డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి చెప్పాడు. ఈ చిత్రంలో పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు.
ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
MSG | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మెగాస్టార్ సినిమా.. తొలి వారం రూ.292 కోట్ల వసూళ్లతో సంచలనం
Mirai | టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైన బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’… ఈ నెలలోనే స్టార్ మా లో సందడి