OG Movie Teaser | ప్రీ లుక్ పోస్టర్‌తో వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేసిన ఘనత సుజీత్కే దక్కింది. పవన్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా.. అభిమానులు మాత్రం కాస్త ఎక్కువ ఎగ్జైట్ అవుతుంది ఓజీ సినిమా కోసమే. అర్థం చేసుకోలేక ఫ్లాప్ చేశామే కానీ.. సాహో సినిమా స్థాయి వేరన్నది ఎందరో అన్న మాటలు. అలాంటి సుజీత్ నుంచి ఐదేళ్ల తర్వాత సినిమా, అది కూడా పవన్ కళ్యాణ్‌తో అంటే అంచనాలు ఖచ్చితంగా తారా స్థాయిలోనే ఉంటాయి. సుజీత్ సైతం అభిమానుల అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్. పవన్ కెరీర్లోనే ది బెస్ట్ ఇంట్రోను ఈ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారట. ఫైట్స్ అయితే టాలీవుడ్లో నెవర్ బిఫోర్ అని టాక్. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది.
ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 2న రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ టీజర్ 72సెకండ్ల పాటు ఉండనుందని తెలుస్తుంది. అంతేకాకుండా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో టీజర్ ఉండనుందని సమాచారం. ఈ అప్డేట్ పవన్ అభిమానులు ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు ‘పంజా’ సినిమాలో అటు ఇటుగా కొంచెం గ్యాంగ్‌స్టర్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.