Pawan Kalyan | ప్రస్తుతం పవన్‌కల్యాణ్ చేతిలో ఉన్న సినిమాలు హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్. ఈ మూడు చిత్రాలనూ పూర్తి చేస్తానని సదరు చిత్రాల నిర్మాతలకు పవన్ భరోసా ఇచ్చేశారు. అందులో భాగంగా ముందు ఆయన ‘ఓజీ’ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే దాదాపుగా 80శాతం ఈ సినిమా పూర్తయింది. ముంబై నేపథ్యంలో గ్యాంగ్స్టర్స్ కథాంశంగా తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమా షూటింగ్‌ని దర్శకుడు సుజిత్ సెప్టెంబర్‌లో ప్లాన్ చేశారు.
కథ రిత్యా ఇది ముంబై నేపథ్యమే అయినా.. ఇందులో కథానాయకుడి పాత్రకు విజయవాడతో సంబంధం ఉంటుందట. అందుకే విజయవాడకు సంబంధించిన సన్నివేశాలతో పాటు ముంబై సీన్స్‌ని కూడా దర్శకుడు సుజిత్ విజయవాడలోనే ప్లాన్ చేశారట. పవన్‌కి ఇబ్బంది లేకుండా అక్కడే ముంబైని తలపించే ఓ సెట్‌ని నిర్మించే పనిలో ఉన్నారట చిత్ర యూనిట్.
విజయవాడకు సంబంధించిన సన్నివేశాలను అవుట్‌డోర్‌లో చిత్రీకరించి, ముంబై సీన్స్‌ని సెట్లో పూర్తి చేస్తారట. ఈ సినిమాకోసం వారానికి రెండు రోజులు మాత్రమే పవన్ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తున్నది. పవన్ పార్ట్ పూర్తి చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌పై దృష్టిసారిస్తారట సుజిత్. ఈ ఏడాది చివరల్లో ‘ఓజీ’ని విడుదల చేయడానికి నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్చేస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.