Pawan Kalyan | ఇంకా రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ కానీ ఓజీ సినిమాపై పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ అభిమానులతో సహా సగటు సినీ ప్రేక్షకుడుని సైతం విపరీతంగా ఆకట్టుకుంది. సాహో దర్శకుడు సుజీత్ ఐదేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాడు. అర్థం చేసుకోలేక సాహో సినిమాను ఫ్లాప్ చేశామే కానీ.. ఆ సినిమా స్థాయి వేరన్నది మహామహులే అన్న మాటలు. అలాంటి సుజిత్ నుండి ఐదేళ్ల తర్వాత సినిమా, అది కూడా పవన్ కళ్యాణ్‌తో అంటే ఇంకా ఏ రేంజ్లో ఎక్స్ట్పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు ఇన్‌డైరెక్ట్‌గా చిత్ర యూనిట్ ఆ మధ్య ఓ ట్వీట్ వేశారు.
మళ్లీ ఆ తర్వాత దాని చప్పుడే వినిపంచడంలేదు. లీకుల రూపంలో టీజర్ వస్తుందని, నిడివి 72 సెకండ్లని, అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇస్తాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అఫీషియల్‌గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో పవన్ ఫ్యాన్స్‌లో గందర గోళం ఏర్పడుతుంది. కాగా తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని డీవీవీ ఎంటర్టైనమెంట్స్ సంస్థను ట్యాగ్ చేస్తూ మైండ్ పని చేయట్లేదు. ఓజీ గురించి ఏదో ఒకటి చెప్పండి అంటూ టీజర్ గురించి ట్వీట్ వేసాడు. దానికి ఈ సంస్థ సభ్యులు రేయ్ ఆగండి అన్ని పేల్తాయి అంటూ సాంబ సినిమాలోని బాంబు పేల్చే సీన్‌ను జిఫ్ రూపంలో పంచుకుంది. ఇలా మాస్ స్టేట్మెంట్ ఇవ్వడంతో పవన్ అభిమానులు సంతోషం అంతా ఇంతా కాదు.
సెప్టెంబర్ 2న ఖచ్చితంగా సోషల్ మీడియా బ్లాస్ట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.
Reyyy… Aagandi… Anni Pelathaayi… 🔥💥
You can expect NEVER BEFORE HIGH on Sept 2nd!! pic.twitter.com/PmV6is0prE
— DVV Entertainment (@DVVMovies) August 27, 2023