OG Movie Latest Update | ఒక ఖుషీ, ఒక అత్తారింటికి దారేది, ఒక గబ్బర్‌సింగ్ ఎలాగో ఓజీ కూడా అలాంటిదే అని సినీ ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమాలు పవన్ కెరీర్లో ఎలాంటి సంచలన రికార్డులు కొల్లగొట్టాయో.. సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ కూడా ఆ స్థాయిలోనే రికార్డుల బద్దలు కొడుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో పవన్ సినిమాలన్నింటిలో ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా ఇదే. ప్రీ లుక్ పోస్టర్ నుంచి స్టార్ కాస్టింగ్ వరకు ప్రతీది ఒక సంచలనమే. పవన్ సైతం ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాడంటే ఆయన ఈ ప్రాజెక్ట్‌ను ఎంత నమ్ముతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్రేకుల్లేని బుల్డోజర్లా దూసుకుపోతుంది. చూస్తుండగానే షెడ్యూల్స్ పూర్తవుతున్నాయి. తాజాగా ఈ సినిమా మూడో షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న మేకర్స్ వెల్లడించారు. అంతేకాకుండా దీంతో 50శాతం షూటింగ్ కూడా పూర్తయిపోయిందని తెలిపారు. ఈ లెక్కన చూసుకుంటే మరో రెండు, మూడు నెలలో టాకీ పార్టు మొత్తం పూర్తవుతుంది. ఆపై మరో నెల, రెండు నెలలు ప్యాచ్ వర్క్, ప్రమోషన్లు గట్రా ప్లాన్ చేసుకున్నా ఈ ఏడాది చివర్లో లేదంటే సంక్రాంతికి ఈ సినిమా వచ్చే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
సాహో తర్వాత సుజీత్ ఏకంగా ఐదేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పవన్ క్రేజ్‌కు తగ్గట్లు ఎలాంటి బొమ్మ పడితే బాక్సాఫీస్ సైతం భయపడుతుందే అలాంటి సినిమానే సుజీత్ తీస్తున్నాడని సినీ వర్గాల్లో ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడట. పంజా తర్వాత దాదాపు పన్నెండేళ్లకు మళ్లీ గ్యాంగ్‌స్టర్ అవతారమెత్తబోతున్నాడు. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుంది.
Action, Epicness & Drama…
A very productive three Schedules Done & Dusted. #OG Completes 50% of the shoot. Exciting weeks ahead 🤙🏻🔥#FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/x2wkRvLkgB— DVV Entertainment (@DVVMovies) June 26, 2023