OG | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాల స్పీడ్ పెంచాడు. ఒక సినిమా తర్వాత ఒక సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం ఓజీ చిత్రీకరణ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. డీవీవీ ఎంటర్టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. షూటింగ్ ఆలస్యమైనపప్పటీకీ.. ఈ సినిమాపై పెరుగుతున్న క్రేజ్ రోజురోజుకి పెరుగుతూ పోతుంది.
ఈ మూవీ.. సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంది. ఇలాంటి సమయంలో షూటింగ్ కి సంబంధించిన న్యూస్ ఒకటి ఆసక్తికరంగా మారింది. నిన్నటితో ముంబై షెడ్యూలు పూర్తి కాగా, రేపటి నుంచి విజయవాడ షెడ్యూలు మొదలు కానుంది అంటున్నారు. తాడేపల్లిలో 10 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూలులో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారని, ఈ షెడ్యూల్ తో మొత్తం షూట్ పూర్తి అవుతుందని టాక్ నడుస్తుంది. పది రోజులలో షూటింగ్ మొత్తం పూర్తి కానుందని తెలిసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఓజీ విషయానికి వస్తే.. సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) అనే వర్కింగ్ టైటిల్‌తో డిసెంబర్ 2022 సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది పూర్తి కానుంది.