OG Movie Box Offiice | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (They Call Him OG) చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా పదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. పవన్ స్టామినాతో ఈ సినిమా మొదటిరోజే రూ.154 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే ఇదే వేగంతో రెండో రోజు కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుంది అనుకున్న ఈ చిత్రం కలెక్షన్లలో భారీ పతనం కనిపించింది. దీంతో రెండో రోజు ఈ సినిమా సుమారు రూ.20 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తుంది. తొలిరోజు అభిమానుల సందడి, టికెట్ ధరల పెంపు వలన ఆ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయని రెండో రోజుకి.. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడం.. టికెట్ ధరలు అధికంగా ఉండటంతో పాటు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో కలెక్షన్లు తగ్గినట్లు తెలుస్తుంది. అయితే మరోవైపు వీకెండ్ వస్తుండటంతో పాటు పండుగ వస్తుండటంతో ఈ సినిమా మరింత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బతుకమ్మ పండుగ అని తెలంగాణ ప్రజలు ఇళ్లకు పయనమవుతున్నారు. మరోవైపు హైదరాబాదుని మూసీ వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడం గగనమేనని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.