పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా ‘ఓజీ-2’ రానుంది. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలైనట్లు తెలియజేస్తూ గురువారం మేకర్స్ ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేశారు. ‘గంభీర కథ సిద్ధమవుతున్నది. తుఫాను రావడానికి ముందు..నిశ్శబ్దం ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొన్నది.
పోస్టర్‌పై ‘భయం కలిగించే వ్యక్తి నగరానికి తిరిగొచ్చాడు’ అని జపనీస్ అక్షరాలతో ఉన్న ట్యాగ్‌లైన్ ఈ కథపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. జపాన్‌తో లింక్ అయ్యి ఉండే కథ ఇదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కబోతున్నది.