AA22xA6 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. “పుష్ప 2: ది రూల్” తర్వాత అల్లు అర్జున్ చేయబోయే 22వ సినిమా ఇది. జవాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇది సైన్స్ ఫిక్షన్, యాక్షన్-ఫాంటసీ జోనర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని తెలుస్తోంది. సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించడానికి ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి సాలిడ్ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone in AA22xA6) నటించబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా దీపికా పాత్రను రివీల్ చేస్తూ స్పెషల్ వీడియోను పంచుకుంది.
Read more