‘సినిమా సమష్టి కృషి. ఒకరి ఆలోచనతో మొదలైనా.. టీమ్ మొత్తం మనసుపెట్టి పనిచేస్తేనే సినిమా రూపొందుతుంది. అందులో ఏది బావున్నా ఆ క్రెడిట్ అందిరిదీ. ఈ నిజం సంపత్ నందికి బాగా తెలుసు.’ అంటూ కొనియాడింది తమన్నా భాటియా. ‘ఓదెల 2’ సినిమాకు సంబంధించిన ఆమె ఫస్ట్ లుక్‌ని శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు.
ఆ లుక్‌కి విశేష స్పందన రావడంతో ఆ చిత్ర సమర్పకుడు సంపత్ నంది సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తమన్నా లుక్ అద్భుతంగా రావడం వెనుక ఎవరెవరి కృషి ఉందో, అందర్నీ పేరుపేరున అభినందిస్తూ పోస్టు పెట్టారు. డిజైనర్ నీతా లుల్లా నుంచి తమన్నా పర్సనల్ స్టాఫ్ వరకూ అందరికీ థ్యాంక్స్ చెప్పారు.
ఈ నేపథ్యంలోనే తమన్నా సంపత్ నంది పోస్ట్‌పై స్పందించింది. ‘ నా 19ఏళ్ల కెరీర్లో సంపత్ నంది లాంటి వ్యక్తిని చూడలేదు. సంస్కారానికి మారు పేరు తను. ‘ఓదెల 2’లో నా గెటప్ వెనుక ఎంతోమంది శ్రమ ఉంది. వారందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ లుక్ విషయంలో వచ్చినంత స్పందన ఇప్పటివరకూ నా ఏ లుక్ విషయంలోనూ రాలేదు. ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది మిల్కీబ్యూటీ.