Tamannah Bhatia | టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఆడపదడప సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి 1 తర్వాత ఈ భామకి సరైన హిట్ లేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది ఈ భామ. అయితే చాలా రోజుల తర్వాత తమన్నా తెలుగులో ఒక సినిమా చేస్తుంది.
ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓదెల 2 (Odela 2). 2021లో విడుదలైన “ఓదెల రైల్వే స్టేషన్” సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. సూపర్నాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) కథను అందిస్తుండగా.. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు ఇంకా 10 రోజులు కూడా లేకపోవడంతో వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రబృందం.
ఈ క్రమంలోనే ముంబైలో ఉన్న పురాతన శివాలయం అయిన బాబుల్నాథ్ టెంపుల్ని దర్శించుకుంది తమన్నా. ఓదెలా 2 టీమ్‌తో కలిసి ఆలయానికి బాబుల్నాథ్ ఆలయానికి వెళ్లిన తమన్నా శివుడికి ప్రత్యేక పూజలు చేసి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంది. ఇక తమన్నా రాకతో ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్‌గా మారాయి. మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా ఒక నాగ సాధువు పాత్రలో కనిపించనుంది.
#Odela2 చిత్రం కోసం పూజలు నిర్వహిస్తున్న @tamannaahspeaks #TamannaahBhatia pic.twitter.com/jGgbfWLqd2
— VRMadhuPR (@VRMadhuPR) April 8, 2025