‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ఓదెల 2’. తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అశోక్‌తేజ దర్శకుడు. డి.మధు నిర్మాత. దర్శకుడు సంపత్‌నంది పర్యవేక్షణలో రూపొందుతోన్న ఈ చిత్రంలో తమన్నా శివశక్తి నాగసాధు పాత్రలో నటిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ జరుగుతున్నది. కాశీలో మొదలైన ఈ షెడ్యూల్ ప్రస్తుతం ఓదెల మల్లన్న క్షేత్రంలో పూర్తికానుంది.
ఓదెల గ్రామంలోని అందమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తమన్నా, మురళీశర్మ, హెబ్బాపటేల్, యువ.. ఇతర నటీనటులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇదో ఉద్వేగపూరితమైన యాక్షన్ ఎంటైర్టెనర్ అని, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వనున్నదని మేకర్స్ చెబుతున్నారు. వశిష్ట ఎన్ సింహ, నాగమహేశ్, వంశీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్.ఎస్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: మధు క్రియేషన్స్, సంపత్‌నంది టీమ్ వర్క్స్.