O Sukumari | టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ నటుడు తిరువీర్ (Thiruveer) కీలకపాత్ర పోషిస్తున్న కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘మసూద’, ‘పరేషాన్’,’ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ ఈసారి ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా జాతీయ అవార్డు గ్రహీత, నటి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) నటించనున్నారు. ఓ సుకుమారి (O Sukumari) అంటూ రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది. గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను గంగ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తుండగా భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయగా.. ఆకట్టుకుంటుంది.
It’s Oh..! Sukumari ❤️⚡
This one is truly special and I believe it will bring me even closer to your hearts. 🤗🙏🏻#OhSukumari @aishu_dil @SS_bharath @GangaEnts @MaheswaraMooli @RKushendar @bharathmusic8 @9_vara5972 @purnachary17 @UrsVamsiShekar pic.twitter.com/LHLPwRarpX
— Thiruveer (@iamThiruveeR) December 3, 2025