Nuvvunte Chaley | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు పీ కాంబినేషన్లో వస్తున్న ‘ఆంధ్ర కింగ్’ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. దీంతో తాజాగా చిత్ర బృందం సినిమాలోని మొదటి సింగిల్ ‘నువ్వుంటే చాలే’ ప్రోమోను విడుదల చేసింది. ఈ పాట యొక్క పూర్తి వెర్షన్‌ను జులై 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకు వివేక్ & మార్విన్ సంగీతం అందిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ పాడాడు.
రామ్ ఒక సూపర్ స్టార్‌కి డై-హార్డ్ అభిమానిగా కనిపించబోతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ముఖ్య పాత్రలో నటిస్తుండగా, భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా నటిస్తుంది. రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.