Tiger Nageswara Rao | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్నాడు. 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది. మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం టైగర్ నాగేశ్వరరావు ప్రియురాలు ఫస్ట్ లుక్‌ను లాంఛ్ చేశారు.
నుపుర్ సనన్ ఇందులో సారా పాత్రలో నటిస్తోంది . ట్రైన్లో నుంచి తన ప్రియుడి కోసం చూస్తున్నట్టుగా ఉన్న లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు గ్లింప్స్‌లో గూస్ బంప్స్ తెప్పించే రవితేజ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సీనియర్ నటి రేణూదేశాయ్ హేమలత లవణం పాత్రలో నటిస్తోంది.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) , మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా నటిస్తున్నాడు. మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా నటిస్తున్నాడు. తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 20న విడుదల కానుంది.
సారా ఇంప్రెసివ్ లుక్..
#TigerNageswaraRao pic.twitter.com/irmTLvmJhJ
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 28, 2023
అనుపమ్ ఖేర్ న్యూ లుక్..
You have been our lucky charm sir!
Thank you for being a special part in #TheKashmirFiles and #Karthikeya2 ❤#TigerNageswaraRao will be another special film in our collaboration. https://t.co/4o7qzQW944
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 14, 2023
మురళీ శర్మ న్యూ లుక్..
Introducing the versatile #MuraliSharma as ‘Viswanath Sastry’ from #TigerNageswaraRao ❤️🔥
GET READY FOR TIGER’S INVASION ON AUGUST 17th 🐅@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla… pic.twitter.com/jt62TSDGID
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 15, 2023